భూదాన్ భూముల విక్రయం, అక్రమ నిర్మాణాలపై మైహోమ్, కీర్తి సిమెంట్ యాజమాన్యాలతో సహా 6 గురు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని భూదాన్ భూముల విక్రయం, అక్రమ నిర్మాణాలపై మైహోమ్, కీర్తి సిమెంట్ యాజమాన్యాలు సహా 6మంది ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు. -హుజూర్నగర్ కోర్టు ఉత్తర్వులు జారీ…

-హుజూర్నగర్ కోర్టులో కేసు దాఖలు చేసిన స్థానిక న్యాయవాది కమతం నాగార్జున.

ఫోర్జరీ,చీటింగ్, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కోర్టులో పెండింగ్ ఉన్న భూమిని అమ్మకం, ల్యాండ్ కబ్జా కేసు చేయాలని హుజూర్నగర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ..

11 మంది నిందితులపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు.

 

నిందితులుగా మైహోమ్ సిమెంట్స్ భూముల వ్యవహార ప్రతినిధి మైహోమ్స్ అధినేత జూపల్లిరామేశ్వరరావు బామ్మర్ది మునగాల రామ్మోహన్ రావు, మైహోం ప్లాంట్ హెడ్& ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసరావు, జిఎం కె.నాగేశ్వరావు, కీర్తి సిమెంట్ ఎండి జాస్తి త్రివేణి, మేనేజింగ్ పార్ట్నర్ & ఎండి భర్త జాస్తి శేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ జె.శ్రీనివాస్, మేళ్లచెరువు తాసిల్దార్ కొల్లుదామోదర్, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్, మేళ్లచెరువు పంచాయతీ కార్యదర్శి ఈర్ల నారాయణరెడ్డి, ఇరిగేషన్ ఈఈ, విద్యుత్ శాఖ ఏఈలు.

హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న ప్రభుత్వ ఆధీనంలోని 160 ఎకరాల భూదాన్ భూములపై ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మకాలు జరిపారని, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు, మట్టి మాఫియా, బోర్ల తవ్వకాలు, అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ఎన్ఓసి పత్రాలు పొందినట్లు అభియోగాలు. నిందితులకు సహకరించినట్లు 6మంది ప్రభుత్వ అధికారులపై అభియోగాలు.