రాపల్లి లో చెలరేగుతున్న అల్లర్లు భయాందోళనలో గ్రామస్తులు

బోనకల్ సెప్టెంబర్ 19 (నిజం న్యూస్) మండలంలో రాపల్లి గ్రామంలో తన చెల్లితో బైక్ పై వస్తున్న చల్లా చిట్టీబాబు పై కాపు కాచి విచక్షణా రహితంగా కర్రతో దాడి చేసిన చల్లా బాబురావు.మూడు నెలల క్రిందటే చేనులో పని చేసుకుంటున్న చింతల ముక్కంటి కొడుకు అయిన చింతల సుమంత్ పై కూడా దాడి చేసి అతని బైక్ ను ధ్వంసం చేసిన ఘటన మరువకముందే అదే చల్లా బాబురావు తన సమీప బంధువైన చల్లా కుటుంబరావు కొడుకుపై దాడి చేయడం అమానుషం అని గ్రామంలో పలువురు మాట్లాడుకుంటున్నారు.వరుస ఘటనలతో గ్రామంలో చల్లా బాబురావు వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చల్లా బాబురావు పై, అతనికి కొమ్ము కాస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.