కోతి దాడి నుంచి తప్పించుకోబోయి.. ఇంటిపైనుంచి పడి మహిళ మృతి.

బోనకల్ మండలం రాయన్నపేటలో ఓ మహిళా బట్టలు ఆరేసెందుకు ఇంటిపైకి వెళ్లింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న కోతి ఒకటి ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నించింది. కోతి దాడినుంచి తప్పించుకుని కిందకు పరుగెత్తే క్రమంలో ఇంటి పైనుంచి కిందపడి తీవ్రగాయాలు కావటంతో ఖమ్మంలోని ఓ హాస్పిటల్ లో 15 రోజుల నుండి చికిత్సపొందుతూ ఈ రోజు మృతి చెందింది.