నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీంల సోదాలు

నిజామాబాద్ రూరల్ సెప్టెంబర్ 18, (నిజం న్యూస్ ):-
నిజామాబాద్ నగరంలో, జిల్లాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
(ఎన్ ఐఏ) టీంలు సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది వెలుగు చూసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ ఐ)కి సంబంధించిన చార్జిషీట్ ఆధారంగా పిఎఫ్ఎస్ఐ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎన్ ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. వారికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారు.