రజాకార్లను గడగడలాడించిన ఉద్యమ వీరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, సేవలు మరువలేనివి

రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్, ఉద్యమ నాయకులు మందుల సామేల్.
తుంగతుర్తి సెప్టెంబర్ 18 నిజం న్యూస్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన ఉద్యమ వీరుడు, బాహుబలి భీమిరెడ్డి నర్సింహారెడ్డి నేనని రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు.
ఆదివారం మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలోని భీంరెడ్డి నర్సింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లె పాక చంద్రయ్య, కా మ మల్లయ్య ,కాసర్ల వెంకమ్మ , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, కవి, సాహితీవేత్త ఎర్ర హరికృష్ణ లను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాజు పాలనలో రజాకార్లు ,గ్రామాల్లో పడి ప్రజలను హింసిస్తున్న సమయంలో పోరాటానికి నాంది పలికి తుపాకులు చేత బట్టి ,రజాకార్లను పొలిమేర దాటి వెళ్లగొట్టిన వీరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి , చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ధర్మభిక్షం లు , మల్లు స్వరాజ్యం లాంటి వారు పోరాటం చేశారని అన్నారు. వారు చేసిన సేవలను కొనియాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పలువురిని సన్మానించిన ట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రాజిరెడ్డి ల సేవలను మరిచిపో వద్దని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ పూస పెళ్లి బిక్షం, కాసర్ల సోమయ్య వర్ధిల్లి మహేష్ కాసర్ల మన్సూర్ వెంకటమ్మ ఉప్పలయ్య సైదయ్య రాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.