చరిత్ర తెలియని హీనులు బిజెపి నాయకులు

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు.
తుంగతుర్తి సెప్టెంబర్ 16 నిజం న్యూస్
చరిత్ర తెలియని హీనులు బిజెపి నాయకులు, పార్లమెంటుకు డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు అన్నారు
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు తుంగతుర్తి మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 10 వేల మందితో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు చేతబూని , వీధుల గుండా ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. పలు చోట్ల పటాకులు కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావలసిన బడ్జెట్ను ఇవ్వకపోగా రైతుల పొలాల దగ్గర మీటర్లు పెడతామని హెచ్చరించడం దుర్మార్గమని అన్నారు. దేశ సంపద మొత్తం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లు విమర్శించారు. దేశం మొత్తం రైతులకు కావాల్సిన కరెంట్ కోసం ఒక లక్షా నలభై ఐదు వేల కోట్లు అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారుల ప్రయోజనార్థం 12 లక్షల కోట్లను రుణ మాఫీ చేయడం దారుణమని అన్నారు.14 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు దళిత బంధు రైతు బంధు రైతు బీమా ఆసరా పింఛన్లు కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశంలోనే పేరుగాంచిన వాణి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 53635 మందికి ఆసరా పింఛన్లు లబ్ది పొందగా సుమారు 13 కోట్లు ప్రతినెల వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, పిడి కిరణ్ కుమార్, డీఎస్పీ నాగభూషణం, తాసిల్దార్ రాంప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ పుష్ప, ఆయిల్ ఫ్రెండ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు,జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ ఏ రజాక్, తుంగతుర్తి ఎంపిపి గుండ గాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని, అర్వపల్లి జడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్, మున్సిపల్ చైర్మన్లు, పిఎసిఎస్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, తాటికొండ సీతయ్య వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ ఎంపీటీసీ చర్చి సుజనా పరమేష్ తడకమళ్ళ రవికుమార్ బొంకురి మధు కటకం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీపీలు, అన్ని శాఖల అధికారులు, అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.