పార్లమెంట్ కు డాక్టర్ అంబెడ్కర్ పేరు పెట్టాలి

వర్తమాననికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చరిత్ర.
దేశ చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సూర్యాపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం.
విద్యుత్ శాఖ మంత్రిగుంటకండ్ల జగదీష్ రెడ్డి.
సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 15 నిజం న్యూస్
రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు.ఈ మేరకు ఇంతటి చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద గల అంబెడ్కర్ విగ్రహం వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్,సైది రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం నిర్వహించారు. అంతకు ముందు అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘణ నివాళి అర్పించిన మంత్రి మాట్లాడుతూ వర్తమాననికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ చరిత్ర తెలుసునేందుకు ఇదొక మహార్దవకాశంగా ఉంటుందన్నారు.
దేశంలోని మిగితా రాష్ట్రాలు ఇదే సంప్రదాయం పాటిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి కారణభూతంగా నిలిచిన భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరును హైదరాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.అందుకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్:
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్.
తెలంగాణ సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అభినవ అంబేద్కర్ గా మారారని తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు… పార్లమెంట్ కు అంబెడ్కర్ పేరు నామకరణం చేయాలని చేసిన తమ డిమాండ్ కు స్పందించని తాటాకు తంభాకు బ్యాచ్ మత ఘర్షణల ద్వారా బ్యాలెట్ లు నింపుకోవడం మాత్రమే కావాలని హెద్దేవా చేశారు. పార్లమెంట్ కు అంబెడ్కర్ నామకరణం చేసే వరకు ముఖ్యమంత్రి ఏ పిలుపు ఇచ్చిన ఉద్యమం చేయడానికి తాము సిద్దం అని కిషోర్ అన్నారు.. పార్లమెంట్ కు అంబెడ్కర్ పేరు పెట్టే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఎంపి బడుగుల హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా, వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, ఎంపిపి నెమ్మా ది బీక్షం, జడ్పీటిసి జీడి బిక్షం, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్ , రాష్ట్ర నాయకులు చిన శ్రీరాములు, తళ్లమళ్ళ హుస్సేన్, తప్పెట్ల శ్రీరాములు, పట్టణ టీ. ఆర్. ఎస్ అధ్యక్ష కార్యదర్శులు సవరాల సత్యనారయణ, బూర బలా సైదులు గౌడ్, భరత్ మహాజన్, జ్యోతి కరుణాకర్ శ్రీ విధ్య, పున్న శశికాంత్, మార్కెట్ డైరెక్టర్ సైదులు, మొండి కత్తి వెంకటేశ్వర్లు, టీ. ఆర్. ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ , దళిత నేతలు, వార్డ్ కౌన్సిలర్లు పాల్గోన్నారు