వ్యవసాయ పంట రుణాలపై అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 (నిజం న్యూస్)
యాదాద్రి
మండలంలో వీరవెల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఎపిజివిబి) భువనగిరి శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ పంట రుణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బ్యాంకు హబ్ మేనేజర్ బి.శంకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులో రైతులకు పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలు అందిస్తున్నాయని, రైతులు పంట రుణాలను నిర్ణీత సమయంలో చెల్లించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వడ్డీ మాఫీని పొందవచ్చునని,అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలు అయిన ఫిషరీ, సెరికల్చర్, డైరీ గూర్చి, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ గూర్చి, వ్యవసాయ యాంత్రీకరణ భాగంగా యంత్రాలు కొనుగోలుకు ప్రభుత్వాలు ఇచ్చి సబ్సిడీ రుణాలు గూర్చి పంట, బీమా తదితర అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రీజినల్ బ్యాంక్ డెస్క్ ఆఫీసర్ ఏ. శివకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ త్రివేణి, బిజినెస్ కరస్పాండెంట్ ఆర్.గోవర్ధన చారి,తంగళ్ళపల్లి శ్రీనివాస్ చారి,కంచి మల్లయ్య మరియు రైతులు పాల్గొనడం జరిగింది.