ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంఐఎంకు భయపడి చరిత్ర వక్రీకరిస్తున్నారు

బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు.

బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.

సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 14 నిజం న్యూస్

తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ జెండాలు చేతభూనీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఇట్టి బైక్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు గారు హాజరై మాట్లాడుతూ

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం నిజాం పాలన నుండి విముక్తి కలిగి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది..

ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది.

ఉద్యమ కాలంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని చెప్పి ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా నేడు తెలంగాణ వచ్చినా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం కు భయపడి చరిత్రను వక్రీకరిస్తూ జాతీయ సమైక్యత దినోత్సవం గా ప్రకటిస్తున్నారు.. ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే.

భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా తెలంగాణ స్వాతంత్ర్య పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

గత కొన్నేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంది..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు..

సెప్టెంబర్ 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు…

ఈ కార్యక్రమంలో యువ మోర్చా పట్టణ అధ్యక్షులు దోసకాయల ఫణి నాయుడు, పట్టణ అధ్యక్షులు ఎండి అబిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర ,జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వెంకట్ రెడ్డి, చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి మల్సూర్ గౌడ్ ,మండల పార్టీ అధ్యక్షులు పందిరి రామ్ రెడ్డి, వెన్న శశిధర్ రెడ్డి, పోకల రాములు, పేర్వాల లక్ష్మణరావు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వ దాసు ఉపేందర్ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు మీరు అక్బర్, మరియు యువ మోర్చా నాయకులు, జిల్లా , పట్టణ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు..