విష జ్వరాల మాటున కంభంపాడు

వత్సవాయి, సెప్టెంబర్ 12 (నిజం న్యూస్)మండల పరిధిలోని కంభంపాడు గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ముగ్గురు,నలుగురు జ్వరాల భారిన పడుతున్నారు. డెంగ్యూ, టైపాయిడ్, ప్లేట్లెట్స్ తగ్గుతూ ఇలా అనేక విష జ్వరాలతో గ్రామ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. డెంగ్యూ, టైపాయిడ్, ప్లేట్లెట్స్ టెస్టులు చెయ్యడానికి బయట వేల రూపాయలు వెచ్చించి చేయించుకోవలసీ వస్తుంది. డెంగ్యూ, వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉన్నచోట హెల్త్ క్యాంపులను నిర్వహించి, జ్వర తీవ్రతను అరికట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. వైద్యం కోసం మధిర,ఖమ్మం, విజయవాడ వెళ్లి వేలకు వేలు జేబులో ఉన్న డబ్బును గుల్ల చేసుకుంటున్న వైనం. గ్రామం లో ఆశా వర్కర్లు కానీ , ఏఎన్ఎం లు కానీ గ్రామంలో క్యాంపులను నిర్వహించలేకపోతున్నారు. ప్రభుత్వ అధికారులైనటువంటి సెక్రటరీ, వీఆర్వో, సర్పంచ్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.