అయ్యా కార్పొరేటర్, అధికారులు జర మా సమస్యని పరిష్కరించండి

అయ్యా కార్పొరేటర్, అధికారులు జర మా సమస్యని పరిష్కరించండి
-శేరిలింగంపల్లి గ్రామం లో డ్రైనేజీ వ్యవస్థ దారుణం
-పలువురు స్థానికులకు,చిన్న పిల్లల కు గాయాలు
శేరిలింగంపల్లి, నిజం న్యూస్, (సెప్టెంబర్ 11)
శేరిలింగంపల్లి డివిజన్ పరిధి లోని లింగంపల్లి గ్రామం లో డ్రైనేజీ వ్యవస్థ చాల అద్వానంగా తయారయంది లింగంపల్లి గ్రామం లో పొచ్చమ్మ ఆలయం వెనుక గత మూడు నెలలుగా డ్రైనేజీ పొంగి పొర్లుతుండం తో ఆ దారిన స్థానికులు వెళ్ళలాంటే బయ భ్రాంతులకు గురువుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకునే మన నగరం లో ఇలాంటి పరిస్థితి, మరి ఎన్నో గొప్పలు చెప్పుకునే మన అధికారులు కానీ, పాలకులకు కానీ గత మూడు నెలలు నుండి స్థానికులు పడుతున్న ఈ సమస్య ఎందుకు కానరాలేదో వారికే తెలియాలి. నిత్యం ఆ దారిలో డ్రైనేజీ రోడ్ ల పై ప్రవహిస్తుండం తో అటుగా వెళ్తున్న పాదచారుల కానీ వాహనదారులు కానీ నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
ఎంతోమంది వాహనదారులు, పాదచారులు కానీ చిన్న పిల్లలు సైతం స్కిడ్ అయ్యి కింద పడి హాస్పిటల్ పలాయన ఘటనలు ఎన్నో ,ఇప్పటికి కూడా ఇంకా గాయాలు తగ్గక పోవడం తో క్షతగాత్రులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఇందులో చిన్న పిల్లలు కూడా ఉండడం ఆలోంచించాల్సిన విషయం, ఇదే కాకుండా నిత్యం మురుగు నీరు ప్రవహిస్తుండం తో మలేరియా, థైఫొయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా దాని పై అతిహుత్సాహం తో రోడ్ వెయ్యడం తో ఈ సమస్య ఏర్పడింది అని స్థానికులు వాపోయారు. గత మూడు నెలలుగా స్థానికులు, కాలనీ వాసులు కార్పొరేటర్ కి, అధికారులకి ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని. జి హెచ్ ఎం సి సిబ్బంది వచ్చిన నామ మాత్రంగా వచ్చి తూ తూ మంత్రంగా పనులు చక్కదిద్దరే కానీ శాశ్వత పరిష్కారం చూపలేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు ఇకనైనా అధికారులు మేలుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులని ప్రమాదాలనుండి, ఆరోగ్య సమస్యల బారిన పడకుండా చూడాలని ఈ సమస్య కి శాశ్వత పరిష్కారం చూపాలని ఇటు అధికారాలకు, అటు కార్పోరేటర్ కు స్థానికులు, కాలనీ వాసులు విజ్ఞప్తి చేసారు