అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు

వీఆర్ఏల మండల సంఘం అధ్యక్షులు. వినోద్ రెడ్డి
తుంగతుర్తి సెప్టెంబర్ 12 నిజం న్యూస్
మిర్యాలగూడ డివిజన్ లోని వి.ఆర్.ఏ కంచర్ల వెంకటేశ్వర్లు పే స్కేల్ రాదేమో అని భయంతో, ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, వారి అంతిమ యాత్రలో పాల్గొనుటకు ఆదివారం వెళ్తున్న తుంగతుర్తి మండల వి.ఆర్.ఏ లను పోలీసు వారు ముందస్తుగా పోలీస్ స్టేషన్లు అరెస్ట్ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు వినోద్ రెడ్డి మాట్లాడుతూ తమ హక్కులకోసం పోరాటం చేస్తున్న వీఆర్ఏల ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వి ఆర్ ఏ ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని అన్నారు.
ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డి, భాస్కర్, పాషా, మాణిక్యం, ధనమ్మ, పద్మయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.