పిడుగుపాటుకు మహిళా రైతు మృతి

చందుర్తి సెప్టెంబర్ 9(నిజం న్యూస్):

చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో పిడుగుపాటుకు మర్రిపల్లి భాగ్యవ (56) అనే మహిళ రైతు మృతి చెందింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు చూసిన ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.