Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కవిత్వం ద్వారా కనువిప్పు కలిగించిన కవి -కాళోజి

మహబూబాబాద్,పెద్దవంగర,సెప్టెంబర్ 09 ( నిజం న్యూస్)

కాళోజి నారాయణరావు 9 సెప్టెంబర్ 1914 వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టహళ్లి గ్రామంలో తల్లి రామబాయమ్మ. తండ్రి రంగారావు పుణ్య దంపతులకు కాలోజి నారాయణరావు జన్మించినారు. తనను అందరూ కాలన్న అని పిలిచేవారు. తన విద్యాభ్యాసం మడికొండ. వరంగల్. హైదరాబాద్ వంటి ప్రాంతాలలో సాగింది.తన కవిత్వం తెలంగాణ ప్రాంతంలో 1969 లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనూ. 2001 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలోనూ తెలంగాణ ప్రజలను చాలా చైతన్యవంతం చేసి అన్ని వర్గాల ప్రజలకు కనువిప్పు కలిగించిన కవిత్వం. తెలంగాణ ప్రజల యొక్క బాధలను. కష్టాలను. యాసను. గోసను. అణచివేతను. ప్రాంతీయ వివక్షతను తాను 1953 లో రాసిన నా గొడవ కవిత్వం ద్వారా కళ్లకు కట్టినట్టుగా వివరించారు. తన కవిత్వంలో సొంత ప్రాంతం వారు. ఇతర ప్రాంతాల వారు మోసం గురించి వివరించారు.
ప్రాంతేతరుడూ మెసం చేస్తేప్రాంతం నుండి తరిమి వేయాలి.అదే మన ప్రాంతం వాడు మెసం చేస్తే
మన ప్రాంతంలోనేపాతర వేయాలిఅని తన ఆవేదనను తెలియజేశారు.భారత ప్రభుత్వం 1992 లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించడం జరిగింది.తన రచనలు
1. నా గొడవ
2. జీవన గీత
3. కాళోజి కథలు
4. నా భారత దేశ యాత్ర
5. అణా కథలు
6. తుది విజయం మనది
7. తెలంగాణ ఉద్యమ కవితలు
8. బాపు బాపు బాపు
భాష గురించి వివరిస్తూ బడి పలుకుల భాషపలుకు బడుల భాషభాష అనేది కాలం మారిన కొద్దీ ఏ విధంగా మారుతుంది తెలియజేశారు.జయప్రకాష్ నారాయణ గురించి వివరిస్తూ _ పుట్టుక నీది _ చావు నీది బ్రతుకు అంతా దేశానిది అని జీవితం గురించి వివరించారు.ఒక్క సిరా చుక్కలక్ష మెదళ్లకు కదలికఅని వివరించారు.1939 లో . 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సార్లు జైలు జీవితం గడిపారు.సత్యాగ్రహం ఆంధ్ర మహాసభవందేమాతరం ఉద్యమంగ్రంథాలయ పౌర హక్కులుఆర్య సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు.తాను 1940 లో రుక్మిణి బాయి ని వివాహం చేసుకున్నాడు.తాను తెలుగు. మరాఠీ . కన్నడం. హిందీ. ఉర్దూ. భాషలలో గొప్ప రచనలు చేశారు.అందుకోసం ప్రజా కవి గా పేరు ప్రతిష్టలు పొందినారు. కాలేజీ నారాయణ రావు అసలు పేరురఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస.రామ్ రాజ్ కాలేజీఇది తన అసలు పేరు1958 _1960. వరకుఉపాధ్యాయ నియోజకవర్గ నుండి శాసనమండలి సభ్యులుగా ఎన్నిక అయినారు.తిరిగి 1977 లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాను ఎన్నో పురస్కారాలు పొందారు. 1972 లో తమ పత్ర పురస్కారం.1992 లో పద్మభూషణ్. 1996 లో కళాసాగర్ మద్రాస్పురస్కారం.1996లోసహృదయసాహిత్యవిశిష్టపురస్కారం.తానుసమైక్యరాష్ట్రంలోఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగామరియు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా సాహిత్య రంగానికి సేవలందించారు.కాలోజీ ఎన్నికల గురించి వివరిస్తూఎలక్షన్ సమయంలోపోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ వాడుఅని కాదుఏ పాటి మంచివాడోఅని చూడాలిఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు కానీ ఇప్పటివరకు సమాజానికి ఏం చేశాడో చూడాలిపెట్టుకున్న టోపీ కాదుపట్టుకున్న జెండా కాదుఇంతకాలం గతంలోపెట్టిన టోపీపట్టిన జెండా చూడు కాళోజి నారాయణ రావు 88 సంవత్సరాల పాటు జీవించారు.13 నవంబర్ 2002తుది శ్వాస విడిచారు.హనుమకొండ సుబేదారిలోని ఎస్బిఐ బ్యాంకు సమీపంలో కాళోజి నారాయణరావు గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రాంతానికి కాళోజి నారాయణరావు మార్గం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 9. కాళోజి నారాయణరావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించింది.కాళోజి నారాయణరావు గారి యొక్క అన్నగారుకాళోజి రామేశ్వర రావు గారు ఉర్దూ భాషలో గొప్ప కవిగా పేరుపొందారు.కాకతీయ యూనివర్సిటీ కాళోజి నారాయణరావు గారిని డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది. తన వీలునామా లోతాను రాసిన ప్రకారం
తన కాకతీయ మెడికల్ కళాశాల కు తన పార్థివ దేహం అప్పగించడం జరిగింది. తాను చేసిన సేవలకు గాను తన పేరున కాళోజి నారాయణరావు ఫౌండేషన్ ఏర్పాటుచేసిఅనేక కార్యక్రమాలను చేపట్టడంజరుగుతుంది.