ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం

మాడ్గుల సెప్టెంబర్ 8(నిజం న్యూస్ ): మాడ్గుల మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణములో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్టు మరియు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటపాటలతో జిల్లాఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందేమాతరం పౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి బట్టు నర్సిరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్టు వ్యవస్థాపకులు బుచ్చయ్య, మాడ్గుల మండల ఎం.ఇ.ఓ సర్దార్ నాయక్, మాడుగుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామానుజన్ రెడ్డి,ఇర్విన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, భాస్కర్ రెడ్డి,తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్,పి.ఆర్.టి.యు మాడ్గుల మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మాడ్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, మరియు మండలంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, మండలంలోని ప్రైమరీస్కూల్ఉపాధ్యాయులుకస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయ బృందం,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామల, మాడుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఈర్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.