జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచే మిస్సింగ్ అయ్యారు

ఆచూకీ దొరకటం లేదు
జిల్లా ఆసుపత్రి వారు సరైన సమాధానం చెప్పటం లేదు
నాకు తల్లి తమ్ముడు కావాలి
నిజామాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 8 నిజం న్యూస్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి తమ్ముడు మిస్సింగ్ అయిపోయారని, ఇప్పటివరకు వారి ఆచూకీ లభ్యం కావడం లేదని, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారని, ప్రస్తుతం తన తల్లి సోదరుని కోసం అనేక చోట్ల వెతుకుతున్నా ఆచూకీ దొరకడం లేదని, నాకు నా తల్లి సోదరుడు ఆచూకీ దొరికేలా న్యాయం చేయండని, నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన బిజ్జల ఆనంద్ కుమార్ విలేకరుల ఎదుట వాపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి సత్యమ్మ కు క్యాన్సర్ వచ్చిందని, చికిత్స కోసం, 8-8-2022 నాడు నిజాంబాద్ పట్టణంలోని మాధవ నగర్ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లడం జరిగింది అని, అక్కడ రెండు రోజులుగా చికిత్స చేసుకుని, అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం రావడం జరిగిందని, అప్పటి నుంచి 02-09-2022, శుక్రవారం వరకు ఆసుపత్రిలోనే ఉన్నారని, తాను మందుల కోసం అని ఇంటికి వచ్చి మళ్లీ ఆస్పత్రికి వెళ్లడం జరిగింది అని 03-09-2002 శనివారం నాడు వెళ్లగా అమ్మ ,తమ్ముడి ఆచూకీ దొరకలేదని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారికి అడుగగా సరైన సమాధానం ఇవ్వడం లేదని, దీంతో నిజామాబాద్ పట్టణం అంతా గాలించినని, అనంతరం బంధువుల వద్దకు వెళ్లి విషయం గురించి చెప్పి సమాచారం తెలుసుకోగా ఎక్కడ కూడా వారి ఆచూకీ దొరకడం లేదని, ఈ విషయం గురించి నిజామాబాద్ జిల్లా రుద్రూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కింద పిర్యాదు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి, తన తల్లి సోదరుడు మిస్సింగ్ అయ్యారని, కనపడకుండా పోయిన తల్లి సోదరుడి ఆచూకీ లభ్యం అయ్యేటట్టు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా ఈ విషయం గురించి తనకు తెలియదని, విషయం తెలుసుకుంటా, పోలీసుల ద్వారా కూడా సమాచారం ఇచ్చి తెలుసుకుంటున్నమని, తమ ఆస్పత్రిలోనే ఉండొచ్చు , అనంతరం మళ్లీ చరవాణి ద్వారా మాట్లాడుతూ24-08-2022 నాడు ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చి అడ్మిట్ కావడం జరిగిందని, మళ్లీ01-09-2022 కు డిశ్చార్జ్ అయి వెళ్ళటం జరిగిందని డిశ్చార్జ్ కు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా తమ వద్ద ఉందని సమాధానం ఇచ్చారు.