బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్సీ

కడ్తాల సెప్టెంబర్ 8 (నిజం న్యూస్ ) కశిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్ మరియు కడ్తాల మండలం చిన్న వేములోనిబావి తాండలలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, తదుపరి కడ్తాల మండలం చెల్లంపల్లికి గ్రామానికి చెందిన నర్సింహ్మ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసి ఆయన మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థికసహాయం 5,000 కుటుంబ సభ్యులకు అందిచారు. తదుపరి అదే గ్రామానికి చెందిన రాజు యాదవ్ ఇటీవల ప్రమాదం జరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసి అతనిని పరామర్శించారు. అదేవిధంగా అతనికి 2,000/- ఆర్థిక సహాయం అందించారు. తదుపరి తమ నివాసంలో వెల్దండ మండలం పోతెపల్లికి చెందిన R. గాంగ్యా నాయక్ కి మంజూరైన 41,500/- ల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల మండల ముఖ్య నాయకులు భాస్కర రెడ్డి, హన్మా నాయక్, కడ్తాల కేఎన్ఆర్బి యువసెన నాయకులు నరేష్ నాయక్, పత్యా తదితరులు పాల్గొన్నారు.