పలుగుపార పట్టించి విద్యార్థులచే వెట్టిచాకిరి

*ఆదర్శ పాఠశాgల లో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం*

*పట్టించుకోని ప్రిన్సిపాల్*

సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 8 ( నిజం న్యూస్ )పుల్కల్ మండలం లోని బస్వపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల అన్యంపుణ్యం ఎరుగని పిల్లలు అక్షరాలు దిద్దే వయసులో పలుగుపార చేతపట్టించి విద్యార్థులచే వెట్టి చాకిరి చేయిస్తున్నారు.ఆ వెట్టి చాకిరి ఇంత వర్షం పడుతుండగా ఏందుకు చేస్తున్నారు అని విలేకరులు విద్యార్థుల ను ప్రశ్నించగా మా పాఠశాల ఉపాధ్యాయులు చేయమన్నారు అందుకే చేస్తున్నాము అని సమాధానం ఇచ్చారు,పాఠశాల లో విద్యార్థుల కు అడుకోవడాని ఆటస్థలం కోసమని అంటూ ఆ పనులు విడిచిపెట్టి పాఠశాల లోకి పరుగులు తీశారు,పాఠశాల బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ పాఠశాల ప్రిన్సిపల్ తన సాలాభం కోసం విద్యార్థులచే వర్షం పడుతున్నప్పటికీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి పాఠశాల ఉపాధ్యాయులు వర్షం పడుతున్న అదే సమయంలో విద్యార్థులు పూర్తిగా తడసి ముద్దయ్యారు అదే వర్షం పడే సమయంలో ఇలా పలుగు పార పట్టి పని చేయించడం ఏంత వరకు సంజసానియమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నింస్తున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు కాయకష్టం వ్యవసాయ పనులు చేసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాల కు చదువుకోసమని పంపిస్తే అక్కడ కూడా పలుగు పార పట్టి పనిచేయించడం ఏంత వరకు సబాబు పిల్లలకు ఉపాధ్యాయులు చదువు నేర్పిస్తున్నారా లేదా పనులు చేసుకోమని చెప్పి పాఠశాల కార్యాలయంలో ఫ్యాన్ ల క్రింద కూర్చుంటున్నారా అని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, పాఠశాల ఉపధ్యాయులు విద్యార్థుల పట్ల దురుసుగా వ్యవహరించడం అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు అట్టి ఆదర్శ పాఠశాల పైన తాగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు,