నర్సాపురం కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన…..డీఈఓ సోమశేఖర శర్మ

-కుళ్ళిపోయిన కూరగాయలను చూసి కాంట్రాక్టర్,వార్డెన్ పై ఆగ్రహించిన డీఈవో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 8 (నిజం న్యూస్) జూలూరుపాడు మండలం నర్సాపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీ చేసిన డీఈవో సోమశేఖర శర్మ పాఠశాల పరిసర ప్రాంతాన్ని సందర్శించారు క్లోరినేషన్ లేని మంచినీటి సదుపాయం భోజనాలను చూసి వంట గదిలో పరిశీలించారు కుళ్ళిపోయిన కూరగాయలను చూసి కాంట్రాక్టర్లపై ఆగ్రహించారు డీఈఓ సోమశేఖర శర్మ ఇలాంటి కుళ్ళిపోయిన కూరగాయలతో విద్యార్థులకు ఎలా భోజనం పెడుతున్నారని హెచ్చరించారు ఇలాంటి భోజనం తిని విద్యార్థులకు జరగరానిది జరిగి అస్వస్థతకు గురైతే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తారని కాంట్రాక్టర్ వార్డెన్ పై నిప్పులు చెరిగారు ఇలాంటి భోజనం పెడితే సహించేది లేదని హెచ్చరించారు జిల్లాలో కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తానని చెప్పారు కలెక్టర్ ఫండ్స్ నుంచి మైనర్ రిపేర్ ల కోసం 50వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు అందులో తక్షణమే 30 వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు పాఠశాల పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదేమైనా పద్ధత అండి వార్డెన్ కాంట్రాక్టర్ సాబ్
విద్యార్థులకు భోజనం బాగాలేక అస్వస్థకు గురవుతున్నది చూసి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరుగుతున్నది ఘటనలపై ముందుగా పసిగట్టిన డీఈవో సోమశేఖర శర్మ కస్తూర్బా గాంధీ పాఠశాలను ఇలాంటిది ఏదో జరుగుతుందని గ్రహించి ముందుగానే ఆకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు వంట గదిలో కుళ్ళిపోయిన కూరగాయలు జీర్ణించలేక వార్డెన్ కాంట్రాక్ట్ పై ఆగ్రహించారు నాణ్యతలేని భోజనాలు విద్యార్థులకు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.