ఆపదలో ఆపన్న హస్తం సీఎం రీలీప్ ఫండ్

తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్. గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి సెప్టెంబర్ 8 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ చేతుల మీదుగా, గోరంట్ల గ్రామానికి చెందిన పాల్వాయి విజయ వెంకన్న RS.38500 ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని అన్నారు ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గోరంట్ల సర్పంచ్ దామెర్ల వెంకన్న ఎంపీటీసీ శ్రీరంశెట్టి వెంకన్న గ్రామ శాఖ అధ్యక్షుడు అమృత రెడ్డి మాజీ మార్కెట్ డైరెక్టర్ తోనుకునూరి అశోక్, పాల్వాయి వెంకన్న శివ తదితరులు పాల్గొన్నారు