Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మా భూమి ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి

మా భూమి ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి

నిలువెత్తు పత్తి చేనును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకలు.

సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 7 నిజం న్యూస్

తాత ముత్తాతల కాలము నుంచి వారసత్వంగా వస్తున్న మాభూమి పైకి పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తూ అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన నల్లగొండ లింగయ్య, కుంభం లింగమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెల్లబోసుకున్నారు. మునగాల మండల పరిధిలోని గుంజలూరు సర్వేనెంబర్20, 21, 23 లలో మా తండ్రిగారు నల్లగొండ ఎల్లయ్య పేర 10.20 గుంటల భూమి ఉందన్నారు. సర్వేనెంబర్ 19లో భూమి ఉన్న కుర్ర వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓరుగంటి ప్రభాకర్ కు 3 ఎకరాల భూమిని విక్రంచి సర్వేనెంబర్ 20 హద్దులు వేయడంతో సదరు ఓరుగంటి ప్రభాకర్ తమ భూమి పైకి వస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అన్నారు. *ఇటీవల మా చేనులో వేసుకున్న నిలువెత్తు పత్తి చేనును ధ్వంసం చేయడంతో పాటు అడ్డుగా వెళ్లిన తన సోదరి లింగమ్మ పై దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా వారే దగ్గరుండి భూమిని ఆక్రమించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాయ కష్టం చేసి సంపాదించుకున్న మా భూమిని కాపాడాలని ,ప్రజా ప్రతినిధులను, జిల్లా కలెక్టర్, అధికారులను వారు వేడుకున్నారు.

ఈ సమావేశంలో కుంభం వెంకన్న, కుంభం క్రాంతి రాజు తదితరులు పాల్గొన్నారు.