Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటా- టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి

ఆపదలో ఉన్న నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటానని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పక్షవాతంతో రెండు కాళ్లు, కండ్లు పోగొట్టుకుని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న అరవిండ్ల నాగరాజు, రాములమ్మల కుటుంబాన్ని పాలకీడు మండల కేంద్రంలో పరామర్శించారు. తక్షణ అవసరాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, కుటుంబ పరిస్థితులను తెలుసుకొని చెలించిపోయారు . ఇద్దరు పిల్లలు కలిగిన ఈ నిరుపేద కుటుంబం వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తుండగా సంవత్సరం క్రితం నాగరాజు పక్షవాతం బారినపడడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పేదరికంలో ఉన్న వీరికి కనీసం నివాస గృహం లేకపోవడం, పక్కనే కస్తూర్బా స్కూల్ లో పనిచేసే కూలీలకు వేసిన తాత్కాలిక గుడిసెలో జీవనం వెల్లదీస్తున్నారు. భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సి రావడంతో భార్య కూడా కూలి పనికి వెళ్లలేని పరిస్థితి, ప్రతి నెల వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహాయం కొరకు ఎదురుచూడాల్సిన దీనస్థితి ఉందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఈ వివరాలను తెలుసుకున్న జన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తి అర్హునుగా ఉన్న నాగరాజుకు ప్రభుత్వం అందించే వికలాంగుల పెన్షన్, ప్రభుత్వ వైద్యం అందించడానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాధితుడికి అవసరమైన మందులను అతి తక్కువ ధరలో ప్రతినెల నేడుచర్ల మండల కేంద్రంలోని అరబండి లక్ష్మీనారాయణ జనరిక్ మెడికల్ షాప్ లో అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి నివాస గృహం మంజూరు అయితే మొదటి అవకాశం ఈ కుటుంబానికి కల్పించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకీడు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్, పెంచికల్ దిన్న మాజీ సర్పంచ్ న్యాయవాది సుంకరి క్రాంతి కుమార్,ధీరావత్ శివ నాయక్,జింకల భాస్కర్, జంపాల శ్రవణ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి కొండ పెద్ద ఎల్లయ్య, మాతంగి రాకేష్, గని, మామిడి సురేష్, మస్తానమ్మ, మీసాల చంటి, రాములు తదితరులు పాల్గొన్నారు.