అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి సెప్టెంబర్ 7 నిజం న్యూస్
జాజిరెడ్డిగూడెంమండలంరామన్నగూడెం, లోయపల్లి గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువరు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బుధవారం తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా, కృషిచేయాలని ,అభివృద్ధి పథకాలపైప్రతిఒక్కరికితెలియజేయాలని కోరారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.