జర్నలిస్ట్ డే ను పురస్కరించుకొని ఘనంగా సన్మానం

జర్నలిస్టుల సేవలు మరువలేనివి:- అర్చక స్వామి అంజయ్య*
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 6 (నిజం న్యూస్)
సమాజ సేవలో ముందుండే జర్నలిస్టుల సేవలు మరువలేనివని అర్చకుడు వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు. మంగళవారం నాడు‘ జర్నలిస్టు డే’ ను పురస్కరించుకుని వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం(కాచారం) లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వంగపల్లి అంజయ్య స్వామితో పాటు భక్తులు పాల్గొని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరుకు చెందిన జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ
సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా జర్నలిస్టులు అందించే సేవలు గొప్పవి అని కొనియాడారు.ఈ సందర్భంగా
వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అమ్మవారికి పూజలు చేస్తూ ప్రజలు భక్తి మార్గం వైపు పయనించేలా అధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్థూ,ఆర్యవైశ్య అర్చకునిగా విశేష సమాజ సేవలు చేయడం అభినందనీయమని జర్నలిస్టులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో బిలకంటి జగదీశ్వరరావు,శైలజ (మహబూబునగర్ వాసవి సేవాసమితి జిల్లా అధ్యక్షుడు), యాదాద్రి కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం ఆలేరు మండల అధ్యక్షుడు సముద్రాల కుమార్,ఆర్యవైశ్య సంఘం ఆలేరు పట్టణ అధ్యక్షుడు అయిత వెంకటేశ్వర్లు,బిలకంటి పరమేష్,జయశ్రీ, పాపిశెట్టి అనిల్ కుమార్, సుప్రియ (సివిల్ ఇంజనీరింగ్, హైదరాబాద్),కాల్వల బాల నరసయ్య,శారద (మక్తల్), మురళి,ఉమ, సత్యనారాయణ,నాగమణి, శ్రీనివాస్,కవిత, భోగ పాండురంగం రూప మరియు జర్నలిస్టులు పోతుగంటి సంపత్ కుమార్ (నిజం న్యూస్ జిల్లా బ్యూరో),మంచన మల్లేశం( తెలంగాణ కిరణం జిల్లా ప్రతినిధి, రాగి చంద్రశేఖర్,రాజా రమేష్, మంచన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.