ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులని బలహీనపరిచిన అఖిల పక్ష కమిటీ 

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులని బలహీనపరిచిన అఖిల పక్ష కమిటీ

అఖిల పక్ష కమిటీ కారణంగా బాధితుల తరుపున పోరాడేవారు కరువయ్యారు

ఆర్ .ఎఫ్ .సి .ఎల్ మరో బాధితుడి ఆత్మహత్య యత్నం

అప్పుల బాధతో నాడు అన్న ఆత్మహత్య నేడు తమ్ముడు ఆత్మహత్య యత్నం

వైద్య ఖర్చులు సమకూర్చుకునే ప్రయత్నం లో శేఖర్ కుటుంబీకులు

అఖిల పక్షం కమిటీ లోని తమ నాయకులతో న్యాయం జరుగుతుందో లేదో ప్రతిపక్ష పార్టీ అధినాయకులు సమాధానం ఇవ్వాలి

పాలకుర్తి /కరీంనగర్ : సెప్టెంబర్ 7: నిజం న్యూస్

పాలకుర్తి మండలం ముంజంపల్లి కి చెందిన గంగుల శేకర్ ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగం కోసం దళారీలని నమ్మి లక్షల రూపాయలు అప్పులు చేసి ముట్టచెప్పాడు. బాధితుడు శేఖర్ సతీష్ ,గ్రామ తెరాస నాయకుడు అరికెల తిరుపతి ద్వారా బొమ్మగాని తిరుపతి గౌడ్ కి పదిలక్షల బేరం కుదుర్చుకొని ఏడు లక్షల రూపాయలు ఇచ్చారని బాధితుడి కుటుంబీకులు చెప్పారు . లక్షల రూపాయలు అప్పులు చేసి తీరా ఉద్యోగం రాక మోసపోవడం తో అప్పులు తీర్చలేక దళారీలకి చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడం తో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా ప్రస్తుతం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు … ఆర్ .ఎఫ్ .సి .ఎల్ బాధితులకి అండగా ప్రతిపక్ష పార్టీ నాయకులు పోరాటం చేయగా ఎమ్మెల్యే చందర్ ఆద్వర్యం లో అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేసి బాధితుల్ని బలహీనపరచి వారితరుపున ఎవరిని

న్యాయపోరాటం చేయకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి . అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేసినప్పటినుండి ఇప్పటివరకు ఒక్కరికి కూడా న్యాయం జరుగలేదు .అప్పులు చేసి ఇచ్చిన డబ్బులు తిరిగివచ్చే మార్గం లేక బాధితులు ఆత్మహత్య లకి పాల్పడుతుంటే అధికార పాలకవర్గాలు కొంచం కూడా

స్పందించట్లేదు .

బాధితుల పక్షాన నిలబడి ఐక్య పోరాటాలు చేయాల్సిన అధికారేతర పార్టీ నాయకులు అఖిల పక్షం కమిటీలో చేరి ఇటు ప్రతిపక్ష అధినాయకులని పోరాటం చేయనీయకుండా అటు అఖిల పక్షం కమిటీ ద్వారా బాధితులకి న్యాయం చేయకుండా చేశారనే బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి .

ఆత్మహత్యలు చేసుకోవద్దు పిర్యాదులు చేస్తే న్యాయం చేస్తామని ప్రకటించుకున్న పోలీస్ అధికారులు ఇప్పటివరకు డబ్బులు రికవరీ చేయకుండా కాలయాపన చేస్తుంటే మరో బాధితుడు ఆత్మహత్యయత్నం చేసాడు .ఒక వైపు మూడునెల క్రితం పెద్దకొడుకును కోల్పోయిన శేఖర్ తల్లి తండ్రులు మరో కుమారుడు ఆత్మహత్య యత్నం చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే తల్లితండ్రులు వైద్య ఖర్చుల కోసం నానాతిప్పలు పడుతూ కొడుకు వెంట బంధువులని ఉంచి డబ్బు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం లో ఉన్నారు .ఏది ఏమైనా అఖిల పక్ష కమిటీలో ఉన్న తమ పార్టీ ల నాయకులు బాధితులకి న్యాయం చేస్తారో లేదో ప్రతిపక్ష పార్టీ ల అధినాయకులు ప్రజానీకానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది