జతిన్ దాస్ 93వ వర్ధంతి యాక్షన్ వీక్ ను జయప్రదం చేయాలి-మావోయిస్టు చర్ల_శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ

జతిన్ దాస్ 93వ వర్ధంతి సెప్టెంబర్ 13 నుండి 19 వరకు జరిగే యాక్షన్ వీక్ ను జయప్రదం చేయాలి..*మావోయిస్టు చర్ల_శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ
చర్ల సెప్టెంబర్ 6 ( నిజం న్యూస్)
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఖైదీల హక్కుల కోసం పోరాడి జైలులోనే తనువు చాలించిన జతిన్ దాస్ 93వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 13 నుండి 19 వరకూ జరగబోవు యాక్షన్ వీక్ ను జయప్రదం చేయాలని మావోయిస్టు పార్టీ చర్ల- శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నాయని సమాధాన్ పేరుతో అమాయక ప్రజలను నక్సల్స్ గా ముద్ర వేసి జైల్లో బంధిస్తున్నారని ఆరోపణలు చేశారు.జైళ్ళలో అత్యధికంగా ఆదివాసీలు, దళితులు, ఆర్ధిక స్తోమత లేని పేద ప్రజలే మగ్గుతున్నారని, ఖైదీల హక్కుల గురించి అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు.ఖైదీల న్యాయమైన డిమాండ్లకు ప్రజాస్వామిక వాదులు,మేధావులు, కార్మిక వర్గాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.ఉపా, అప్సా వంటి కౄర చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జైళ్ళలో ఉన్న మావోయిస్టులను బేషరతుగా పంపిణీ విడుదల చేయాలని,
జైలు మాన్యువల్ ను సంస్కరించాలని,
నూతన పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.