చేజింగ్ చేసే క్రమంలో చుంచుపల్లి ఎస్ఐ వాహనం బోల్తా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 6 (నిజం న్యూస్) చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ సీఎంఆర్ ముందు చుంచుపల్లి ఎస్సై వాహనం అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది బొలెరో వాహనం ముందు నుజ్జు నుజ్జు అయింది ఎవరికి ప్రాణహాని జరగలేదు వివరాల్లోకి వెళితే సుజాతనగర్ నుంచి వస్తున్న కార్ యాక్సిడెంట్ చేసి తప్పించుకోనే ప్రయత్నించడం జరిగింది ఆ కార్ ని చేజింగ్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడటం జరిగింది అందులో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం విశేషం అందులో ఉన్న పోలీసులకు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది.