కార్పొరేటర్ వేదింపులు తాళలేక ఉద్యమకారుడు ఆత్మహత్య యత్నం..రవికుమార్ యాదవ్

ఆల్విన్ కాలనీ, నిజం న్యూస్, (సెప్టెంబర్ 06):

ఆల్విన్ కాలనీ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు నరసింహ చారి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వేధింపులకు తాళలేక నిన్న రాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఆల్విన్ కాలనీ లో చోటు చేసుకుంది , జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర నాయకులు

రవికుమార్ యాదవ్ ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేటర్ అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది , స్థలం కనిపిస్తే కబ్జా చేయడం, బిల్డింగులు కడుతుంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం, డివిజన్ లో ప్రజలకు రాక్షస పాలన చూపిస్తున్నాడని , నిన్న రాత్రి జరిగిన సంఘటనకు పోలీసులు ఇంతవరకు ఎఫైఆర్ ఫైల్ చేయకపోవడం సిగ్గుచేటు, వెంటనే పోలీసులు కేసు బుక్ చేసి కార్పొరేటర్ మీద సమగ్ర విచారణ జరిపి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు, అలాగే కార్పొరేటర్ ను పార్టీ నుండి, పదవి నుండి తొలగించాలని, అతను ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించారు, మేడ్చల్ అధ్యక్షులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ ఆ వ్యక్తిని కొన్ని సంవత్సరాలు గా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, ఒక ఎమ్మెల్యే అండదండలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.