ఘనంగా మువ్వా జన్మదిన వేడుకలు

*పార్వతనేని ప్రసాద్, నర్సికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మువ్వా

*మండలంలోని భారీగా తరలివచ్చిన పొంగులేటి మువ్వ అనుచరులు రాజకీయ నాయకులు

*భారీ బాణా సంచాలతో జన్మదిన వేడుకలు జరిపారు

*జన్మదిన వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన నర్సి ప్రసాద్

*మండలంలో పలుచోట్ల కేక్ కటింగ్లు నిర్వహించిన అభిమానులు*

దమ్మపేట సెప్టెంబర్ 6 నిజం న్యూస్:

పొంగులేటి మువ్వ అనుచరులు పర్వతనేని ప్రసాద్, సాయిల నర్సి ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలో పలుచోట్ల భారీ స్థాయి ఫ్లెక్సీలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఆశాజ్యోతి పొంగులేటి మొదటి అనుచరుడు మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వ విజయబాబు జన్మదిన వేడుకలను భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చి కేక్ కటింగ్ చేసారు. ఈ సందర్భంగా నర్సి మాట్లాడుతూ మువ్వా విజయ్ బాబు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదుగుతూ జిల్లా స్థాయి రాజకీయ నాయకత్వం వహిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు చేసిన కృషి చెప్పలేనిదని, అలాంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన ఉండి ఇంకొంత ముందుకు వెళుతున్నారని, కష్టం వచ్చినా ఏ ఒక్కరిని వదలకుండా తన వంతు సహాయం అందిస్తూ ఎల్లవేళలా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అన్నా అని పిలిస్తే అర నిమిషంలో స్పందించే నాయకుడు మనకు అండగా ఉండటం మన అదృష్టంగా భావించవచ్చని, రాబోయే రోజులలో ప్రజలకు మంచి గడియలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మండలంలో పలుచోట్ల జన్మదిన వేడుకలు మువ్వా పొంగులేటి అభిమానులు సందర్భంగా కేక్ కటింగ్ జరిపారు. ఈ కార్యక్రమంలో దారా యుగంధర్, గోపిశాస్త్రి, దారా మల్లికార్జునరావు.

రాధాయ్యా,రవిశంకర్ పండు,సత్యం బాబు,ఈశ్వర్ విలాస్ ప్రవీణ్, లైవ్ ఫిష్ ఆది,వెంకీ, నగబుషన్,మధు,అమీర్, అచ్చుతపురం పండు,అడపా సాయి,సురేష్,లోకేష్,బీమా శ్రీను,గోపాలరావు,రాజా,కిరణ్,పొంగులేటి మువ్వా అభిమానులు అనుచరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.