మానవత్వం అంటే మీదే ఎస్ ఐ గారు

నిజం న్యూస్ ముదిగొండ మండలం సెప్టెంబర్ 6:-
సాయం చేసే చేతులు ఈ రోజుల్లో కరువు అయ్యాయి అంటారు. అసలు ఎదుటివారికి సాయం చేయాలనే మనసు ఉన్నవారిని అక్కడక్కడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో స్వార్థం తప్ప.. పక్కవాళ్ల గురించి ఆలోచించే వారు తక్కువగానే కనిపిస్తారు అయితే… విషయంలోకి వెళ్తే ఖమ్మం కోదాడ రహదారిపై గోకినేపల్లి సాగర కాలువ దగ్గరలో ట్రాక్టర్ బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి తక్షణమే స్పందించిన స్థానిక ఎస్సై తోట నాగరాజు బాధితులను తన వాహనములో ఎక్కించుకొని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు….నిజమైన మానవతా దృక్పథంతో మానవత్వాన్ని చాటుకున్న ముదిగొండ ఎస్సై తోట నాగరాజు ని మండల ప్రజలు నాయకులు అభినందిస్తున్నారు