ఆర్టీసీ బస్-ఆటో ఢీ- బాలిక మృతి-ముగ్గురి పరిస్థితి విషమం

కళ్యాణ్ దుర్గం సెప్టెంబర్ 6 (నిజం న్యూస్)
బెళుగుప్ప మండలం బ్రహ్మణపల్లి గేట్ సమీపంలో జరిగిన కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు AP02 Z 0468 నెంబర్ గల బస్,AP39 TT 0800 నెంబర్ గల ఆటో ప్రమాదం లో రాయదుర్గం మండలం, రాతిభావి వంక తండాకు చెందిన జ్ఞానేశ్వరి భాయి(6)అనే బాలిక మృతి చెందగా,
మృతురాలి తండ్రి గంగాధర్ నాయక్,తల్లి రుక్మిణి భాయి, చెల్లెల్లు శిల్ప భాయ్ తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
వివరాల్లోకి వెళితే మృతురాలి తల్లిదండ్రులు గత కొంతకాలంగా కూలిపనుల నిమిత్తం అనంతపురం పట్టణంలో కాయగూరలు వ్యాపారం చేస్తూ జీవనం చేసేవారు.అయితే మారెమ్మ జాతర నిమిత్తం తన సొంత గ్రామం లో జాతర ముగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం పట్టణం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.