Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్యాష్ కొట్టు మెడకట్టు ఏక్ పైసా దో పైసా గోవిందా గోవిందా

1/70 ఆక్ట్ ని తుంగలో తొక్కుతున్న బిల్డర్లు

తూతూ మంత్రంగా బిల్డర్లకు పంచాయతీ అధికారుల నోటీసులు

మేడ మీద మేడ కట్టిన తెల్ల కాగితంపై నీటి రాతలు చూపిస్తున్న పంచాయతీ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 5 (నిజం న్యూస్) చుంచుపల్లి మండలం విద్యానగర్ పంచాయతీలో ఆగని అక్రమ కట్టడాలు మేడ మీద మేడ గోవిందా గోవిందా ఏక్,పిసా దో పిసా అయితే కామ్ కతం విద్యానగర్ పంచాయతీ పరిధిలోని ఎక్కడ చూసిన పుట్టగొడుగుల నిలిచిపోతున్న బౌలాంతస్తుల భవనాలు మేడ మీద మేడ మూడు నాలుగు అంతస్తుల మేడ అక్రమ కట్టడాలు 1/70 యాక్ట్ ప్రాంతంలో బహుళ అంతస్తుల కట్టడాలు కాదండోయ్ భవనానికి ఓ రేటు అపార్ట్మెంట్ కోరేటు ఇంత జరుగుతున్నా గ్రామపంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు సారు గ్రామపంచాయతీ అధికారులు నామమంతరంగా పంచాయతీ అధికారులు తనిఖీ చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీసును పెడచెవ్వున పెట్టి సాదాసీదాగా మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకుంటున్నారు బిల్డర్లు 1/70 యాక్ట్ పరిధిలో ఏ నివాసం కట్టాలన్న గ్రామపంచాయతీ అధికారుల అనుమతి తీసుకోవాలి అలాంటిది ఏమీ లేకుండా మెడ మీద మెడ కట్టుకుంటూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న బిల్డర్లు ఇదంతా చూస్తూ ఉండిపోతున్న సంబంధిత అధికారులు గోవిందా గోవిందా 1/70 యాక్ట్ పరిధిలో ట్రైబ్ జి ప్లస్ 1 నివాసానికే అనుమతి కానీ నాన్ డ్రైబ్ జి ప్లస్ 3 4 కట్టుకోవడానికి అనుమతి ఎవరిచ్చారు ఇదంతా గోవిందుని మహిమల లేక గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యమా ఏజెన్సీ చట్టాలను సైతం తుంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణం చేయొచ్చా అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేస్తున్న పట్టించుకునే నాథుడు కరువాయే సంబంధిత అధికారులు వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు 1/70 యాక్ట్ ని తుంగల తొక్కి” కట్టలకు” అక్రమ కట్టడాలకు కేంద్రంగా మారిన విద్యానగర్ గ్రామపంచాయతీ