ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి

-ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 5 (నిజం న్యూస్) కొత్తగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీలైన్ నందు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తాను కూడా ఉపాధ్యాయురాలుగా 12 సంవత్సరాలు సేవలు అందించి అంచలంచలుగా ఎదిగి పట్టణ ప్రధమ పౌరురాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కాపు సీతామహాలక్ష్మి ని సన్మానించారు.కూలీ లైన్ పాఠశాల నందు పదవ తరగతి 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులను, హెచ్ఎం రమాదేవి ని సీతా మహాలక్ష్మి,వార్డు కౌన్సిలర్ బండారు రుక్మేందర్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి మరియు పాఠశాల అభివృద్ధి కమిటీ కోఆప్షన్ సభ్యులు శ్రీ అంకం పాపయ్య,రిటైర్డ్ హెడ్మాస్టర్ రోటరీ క్లబ్ నెంబర్ జి వి బి ప్రసాద్,విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 15 లక్షలు మున్సిపాలిటీ తరఫున శాంక్షన్ అయ్యాయని త్వరలోనే ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని మున్సిపల్ చైర్ పర్సన్ తెలియజేశారు.మున్సిపల్ వార్డు కౌన్సిలర్ బండారు రుక్మందర్ భవిష్యత్తులో ఈ పాఠశాల మోడల్ పాఠశాలగా రూపుదిద్దుకుంటుంది అని తెలియజేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను సన్మానించినందుకు గాను పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ ఉమామహేశ్వరరావు,హెచ్ రామారావు,ఎస్ఎంసి కమిటీ చైర్మన్ విక్టోరియా, కమిటీ మెంబర్ రజిత ధన్యవాదాలు తెలియజేశారు.