పార్టీ బలోపేతానికి అందరూ కలిసి రండి : గట్టు తేజస్వి నిఖిల్

తుర్కపల్లి, సెప్టెంబర్ 05(నిజం న్యూస్) :

తెరాస పార్టీ బలోపేతానికి సంపూర్ణ న్యాయం చేకూర్చoదుకు పూర్తి ప్రయత్నం చేస్తానని టిఆర్ఎస్ నాయకులు గట్టు తేజస్వి నిఖిల్ అన్నారు. మండలంలోని మాదాపూర్ గ్రామంలో సోమవారం సాయి తిరుమల గార్డెన్ లో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు గట్టు తేజస్వి నిఖిల్ పాల్గొని మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సారథ్యంలో మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. 10 రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ కార్యచరణలతో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పార్టీ ప్రతిష్టకు అందరి నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పార్టీలోని అన్ని విభాగాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి కార్యక్రమాలు చేసుకుంటూ ఈనెల 21న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని గ్రామాలలోని వివిధ పార్టీ నాయకులను కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, రైతుబంధు కన్వీనర్ కొమిరిశెట్టి నరసింహులు, టిఆర్ఎస్ నాయకులు సుంకరి శెట్టెయ్య, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, మాదాపూర్ ఉపసర్పంచ్ సీతారాజు, కొమరయ్య, జలగాం కృష్ణ, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.