వినాయకుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం

హాజరైన రాహుల్ కిరణ్

సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 5 ( నిజం న్యూస్ ) పుల్కల్ మండల పరిధిలోని సింగూరు గ్రామంలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోనే అతిపెద్ద వినాయకుడు అయినా అది సింగూరు గ్రామంలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో భారీ గణపతిని ప్రతిష్టించారు అందులో భాగంగా సోమవారం నాడు గణపతి మండపం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సోదరుడు చంటి రాహుల్ కిరణ్ ప్రత్యేకంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూరు గ్రామంలో ఇంత భారీ వినాయకుని విగ్రహాన్ని నిలబెట్టడం తమకు ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు ఇకముందు కూడా గ్రామస్థుల సహాయ సహకారాలతో గ్రామం లో ఏ పండుగ వచ్చినా ఇలాగే ఘనంగా చేసుకోవాలని ఆయన అన్నారు నిమజ్జనం రోజు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలన్నారు ఎవరు కూడా పాత కక్షలతో పార్టీల పేరుతో ఎలాంటి ఘర్షణలు లేకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్, సంగమేశ్వర్ గౌడ్, శివాజీ సేన యూత్ అధ్యక్షులు కిట్టు సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు