Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సమాజంలో గుర్తించబడాలంటే విద్యనే అవసరం.. మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 5 (నిజం న్యూస్)

ఏ సమాజమైన అభివృద్ధి, నాగరిక సమాజంగా గుర్తించబడాలంటే దానికి కొలమానం విద్యనే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు.సోమవారం నాడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని రాయగిరి లోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రి ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఏ సమాజమైనా అభివృద్ధి, నాగరిక సమాజంగా గుర్తించబడాలంటే దానికి కొలమానం విద్యనే అని అన్నారు.ఒకప్పుడు ప్రపంచంలోనే గొప్ప విద్యా వ్యవస్థ కలిగిన, గొప్ప విశ్వ విద్యాలయాలను ప్రారంభించుకున్న ఈ దేశం తర్వాత ఏ కొద్దిమందికో విద్యను పరిమితం చేయబడిందని, తద్వారా భారతదేశంపై దండయాత్రలు జరిగాయని అన్నారు. విద్య ద్వారానే వెలుగు వస్తుందని, తద్వారా మనిషి తాను ఏమిటో తెలుసుకోగలుగుతాడని, దీనిని గుర్తించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు.విద్య విలువ తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గురుకులాల పాఠశాలలను రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం, విద్యకు అధిక ప్రాధాన్య ఇవ్వడం జరిగిందని, ఆణిముత్యాలను తయారుచేయాలని ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.మళ్లీ మనం చీకట్లోకి వెళ్లకుండా ఉండేందుకు తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలని, విద్యాదానం అన్నిటి కంటే గొప్పదని గుర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి గొప్పతనాన్ని తెచ్చారని,తాను రాష్ట్రపతిగా కంటే ఉపాధ్యాయునిగానే ఉండడానికి ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారని, దానికి నిదర్శనమే ఈరోజు వారి జయంతిని గురుపూజోత్సవంగా నిర్వహించుకుని ఉపాధ్యాయులను, గురువులను సన్మానించుకుంటున్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీపరెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సమాజంలో ఉన్నత స్థానం ఇవ్వడం జరిగిందని తెలుపుతూ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ_ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం కింద 12 అంశాలలో ప్రభుత్వ పాఠశాలలో వసతులను పెంపొందించడం జరుగుతున్నదని, జిల్లాలో 750 పాఠశాలలో గాను 251 పాఠశాలలో పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, టీచ్ ఫర్ చేంజ్ కింద 50 స్కూళ్లను దత్తత తీసుకోవడం జరిగిందని, డిజిటల్ క్లాసుల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని అన్నారు.రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ,మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నామని, తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధాన్యత అని, అటువంటి గురువులకు అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున వసతులు కల్పించడం జరుగుతున్నదని,వేలకోట్లతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళుతున్నారని,కొత్త పథకాలతో తెలంగాణను దేశంలోనే ఒక కొత్త రోల్ మోడలల గా చేయడం జరుగుతున్నదని అన్నారు.ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ,తల్లి బిడ్డకు జన్మనిస్తుందని, తండ్రి బాధ్యతలు పంచుకుంటాడని, అలాగే గురువు సంస్కారం, సభ్యతను,వికాసాన్ని నేర్పుతారని తెలియజేస్తూ పిల్లల ముందు ఎలాంటి చెడు అలవాట్లకు తావివ్వకుండా సత్ప్రవర్తనతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు,జడ్పిటిసి బీరు మల్లయ్య,ఎంపీపీ శ్రీమతి నిర్మల, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య,జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి,నాలుగో వార్డ్ కౌన్సిలర్ అరుణ,అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కార్యక్రమ అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సన్మానించడం జరిగింది.