గణేష్ నిమర్జన ఏర్పాట్ల లో భాగంగా కూకట్ పల్లి ఐడిల్ చెరువును ను సందర్శించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

-వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి: సీపీ…

శేరిలింగంపల్లి, సైబరాబాద్, నిజం న్యూస్, (సెప్టెంబర్ 05):

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనాలు జరిగే చెరువులను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, క్రైమ్స్ డీసీపీ,కల్మేశ్వర్ సింగన్వర్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి శ్రీనివాస్ రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ తదితర అధికారులతో కలిసి సిబ్బందికి సూచనలు చేశారు. కూకట్ పల్లి పరిధిలోని ఐడీఎల్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరా మోనిటరింగ్ రూమ్ లో సీసీటీవీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జన కార్యక్రమానికై ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నీటిని పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నామని, నిమజ్జనానికై చెరువు వద్ద మొత్తం 7 భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, శానిటేషన్,మెడికల్ అండ్ హెల్త్ తదితర డిపార్ట్మెంట్ తో కలిసి సమన్వయంగా పూర్తి సన్నద్ధతతో ఉన్నామన్నారు. నవరాత్రులలో ముఖ్యమైన 9వ రోజు, 11వ రోజు భద్రతాపరంగా మరింత కట్టుదిట్టం చేస్తామని వెల్లడించారు. ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ట్రాఫిక్ నియంత్రించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామన్నారు. భద్రత ఏర్పాట్లలో లాండ్ ఆర్డర్ తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారన్నారు

సి పి తో పాటు క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి శ్రీనివాస్ రావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, ఎస్‌బి ఏడీసీపీ రవి కుమార్, ఎస్‌ఓ‌టి ఏడీసీపీ నారాయణ, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు,తదితర అధికారులు పాల్గొన్నారు