నిరుపేద యువతి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

దిక్కుతోచని పరిస్థితిలో ఓ కుటుంబానికి అండగా నిలిచిన అధికారిణి తస్లీమా మహ్మద్!
సబ్ రిజిస్ట్రార్ ఔదార్యం, మానవత్వం పరిమళించిన వేళ…
హైదరాబాద్ సెప్టెంబర్ 5 నిజం న్యూస్.
కన్న కూతురు చనిపోయి అంతక్రియాలు కూడా చేయలేక రోడ్డు ప్రక్కన ఓ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండగా, నేను ఉన్నానంటూ వారికి అండగా నిలిచారు ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్,
నిరుపేద యువతి దహన సంస్కారాలు నిర్వహించి ,మానవత్వం చాటుకున్నారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్.
రెక్కాడితే గానీ డొక్కాడదు,ఉండడానికి నిలువ నీడ లేని ఓ కుటుంబం కన్న కూతురని పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా తస్లీమా గ్రామ పంచాయితీఅధికారులతోమాట్లాడిదగ్గరుండి అమ్మాయి దహన సంస్కారాలు నిర్వహించారు,
వివరాలలోకి వెళితే…కొత్తమల్లేష్,కాంతమ్మ అనే దంపతులకు ఓ కూతురు,కొడుకు వీరికి నిలువ నీడ లేక ములుగు జిల్లా కేంద్రం బండారుపల్లి రోడ్డు మూల మలుపు వద్ధ కొత్త డేరా వేసుకొని 25 సంవత్సరాలుగా పని ముట్లు (కొడవండ్లు) తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు, ఆదివారం వారి కూతురు మేరీ అనారోగ్యంతో బాధపడుతు చనిపోయింది,కన్న కూతురు ఆంతక్రియలు చేయలేక రోడ్డు ప్రక్కన ఉన్నట్లుగా స్థానికులు తస్లీమాకు సమాచారం అందించారు, యువతి దహన సంస్కారాలు నిర్వహించిన తస్లీమా మానవత్వం చాటుకున్నారు.
ఏది ఏమైనా పేద ప్రజల ప్రయోజనాల కోసం కోట్ల నిధులు ప్రవేశపెట్టి ఎంతోమంది అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ తనకి ఏంటి అని ఈ రోజుల్లో వదిలి వేస్తున్న తరుణంలో సమాజంలోని పేద ప్రజల కోసం ఒకపక్క విధి నిర్వహణ చేస్తూ… మరొక పక్క సమాజసేవలో రాణిస్తున్న సబ్ రిజిస్టర్ అధికారిని తస్లీమా మహమ్మద్ కు జేజేలు పలకాల్సిందే….