ఉరి వేసుకొని ఖైదీ ఆత్మహత్య

ఉమ్మడి మెదక్ జిల్లా :
సంగారెడ్డి జిల్లా జైలులో ఉరి వేసుకుని ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగంపల్లి గ్రామానికి చెందిన గంధం అశోక్ వయసు (36) సంగారెడ్డి జైల్లో గత కొంతకాలంగా ఓ హత్య కేసులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం సాయంత్రం తీవ్ర మనోవేదనకు గురైన అశోక్ బ్యారక్ లోని కిటికీ చువ్వలకు తన దగ్గర ఉన్న బెడ్ షీట్ తో ఉరి వేసుకున్నాడు. అప్రమత్తమైన జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు అశోక్ అప్పటికె మృతి చెందినట్లు తెలిపారు.