సీతంపేటలో ప్రధాన రహదారిని మూసివేసిన సీనియర్ నాయకుడు గృహం

*పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు.*
*శాఖపరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వెల్లడి.*
పినపాక సెప్టెంబర్ 2 (నిజం న్యూస్);
పినపాక మండలంలోని సీతంపేట గ్రామంలో సీనియర్ నాయకుడు కొండేరు పుల్లయ్య తన గృహాన్ని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిని కబ్జా చేసి గృహాన్ని నిర్మించాడని గ్రామస్తులు పలు ఆరోపణ చేస్తున్నారు.ఈ విషయం పై సీతంపేట గ్రామంలోని యువకుడు ఈ రోజు ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టి ఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయం పై ఆర్ అండ్ బి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లడించారు. తక్షణమే రహదారికి అడ్డంగున్న గృహాన్ని ఆర్ అండ్ బి శాఖ అధికారుల ఆదేశాల సారాంశం ప్రకారం కూల్చివేయాలని పలువురు కోరుచున్నారు.రహదారి ఇరుకు ప్రాంతం కావడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి.ఈ సంఘటనపై ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. రోడ్డుకు ప్రహరీ గోడ ప్రధానంగా అడ్డంగా ఉందని, దీన్ని తక్షణమే కూల్చివేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు వెల్లడిస్తున్నారు.భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు త్వరగా స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవల్సిందిగా గ్రామస్థుల తరుపున గ్రామంలోని యువకుడు కొండేరు రోహిత్ డిమాండ్ చేస్తూ,అధికారులు పట్టించుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.