నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేకాట పై కొరవడిన నిఘా

జోరుగా పేకాట

మామూళ్ల మత్తులో ,,,

ఏళ్ల నుంచి కొనసాగుతున్నా నామమాత్రపు చర్యలు,,,,

నిజామాబాదు ఉమ్మడి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 2 నిజం న్యూస్

నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని పలు చోట్ల పేకాట స్థావరాలు జోరుగా కొనసాగుతున్న వీటిపై సరైన దృష్టి పెట్టడం లేదని పలువురు మండిపడుతున్నారు. కొంతమంది పేకాట స్థావరాలు కొనసాగించడమే వృత్తిగా పెట్టుకున్నారని, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని, బీర్కూర్, ఇబ్రహీంపేట, దుర్కి ,దేశాయిపేట ,సోమేశ్వర్, గ్రామాల శివారు ప్రాంతంలో అటవీ ప్రాంతాల్లో మంజీరా సరిహద్దు ప్రాంతాలలో, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలుచోట్ల పేకాట స్థావరాలు కొంతమంది నిర్వహిస్తున్నారని, కప్పల మడుగు వద్ద, చుట్టుపక్కల గ్రామాల్లోని అటవీ ప్రాంతాలలో, పలు రహస్య ప్రదేశాలలో, బాన్సువాడ నియోజకవర్గం లోని పలు చోట్ల, పలు మండలాల్లోని రహస్య స్థలాలలో అటవీ ప్రాంతాలలో, వ్యవసాయ భూముల వద్ద, కొంత మంది పేకాట స్థావరాలుజోరుగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పేకాట స్థావరం నిర్వాహకులు మాత్రం పలు పట్టణాలు వివిధ రాష్ట్రాల నుంచి పేకాటరాయుళ్లను ఆహ్వానిస్తూ, పేకాట స్థావరాలు జోరుగా కొనసాగిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేకాట స్థావరం వద్దనే సర్వం పేకాటరాయుళ్ల ను ఏర్పాటు చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేకాట స్థావరం వద్ద పేకాట రాయుళ్లు ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే, అధిక వడ్డీతో డబ్బులు ఇచ్చే వారు లేదా విలువైన వస్తువులను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు, అక్కడే ఉంటారని, మందు, విందు సర్వం పేకాట స్థావరం వద్ద పేకాట నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని, ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేకాట స్థావరం రహస్యాలు ఎవ్వరికి తెలియకుండా ఎవరైనా వచ్చిన సమాచారాన్ని తెలుసుకోవడానికి, పేకాట స్థావరం నిర్వాహకులు మాత్రం కొంతమందిని కూలీ రూపంలో ఏర్పాటు చేసి రోజుకు ఒకరికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కూలి డబ్బులు ఇస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒక్కొక్క రోజు లక్షల రూపాయలతో ఆటలు కొనసాగిస్తున్నారని. పగలు రాత్రి అనే తేడా లేకుండా పేకాట జోరుగా కొనసాగుతున్నప్పటికీ వీటిపై చర్య తీసుకునే సంబంధిత శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునుగుతూ నిర్లక్ష్యం చేస్తున్నారు అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేకాటలో సర్వం కోల్పోయిన వారు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల నుంచి పేకాట స్థావరాలను వృత్తిగా పెట్టుకున్నవారు, కొంతమంది అండదండలతో జోరుగా పేకాట నిర్వహిస్తున్నప్పటికీ, వీరిపై నామమాత్రపు చర్యలు ఉన్నాయి తప్ప శాశ్వత చర్యలు లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.