ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా

-మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 2 (నిజం న్యూస్)
కొత్తగూడెం మున్సిపాలిటీ 31 వ వార్డు కొత్తగూడెం క్లబ్ లో కౌన్సిలర్ ధర్మరాజు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణం లో నిర్వహించడం జరిగింది.ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొని లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ 36 వార్డులలో 1824 ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని దాన్లో భాగంగా రామవరం ఆరో వార్డు చైర్పర్సన్ మదర్ వార్డులో 55 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు ప్రొసీడింగ్ కాఫీని అందజేయడం జరిగిందని వారన్నారు.200 ఉన్న పెన్షన్ 2000 పెంచి పేదవారు ఆత్మగౌరవంగా బ్రతకాలని పేదవారికి పెద్దదిక్కుగా వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెద్దన్నగా రాష్ట్రంలో చెరగని ముద్ర వేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని దేశంలోనే ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళ వికలాంగుల వితంతులకు 2016 రూపాయలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వారన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి,మున్సిపల్ కమిషనర్ నవీన్ కుమార్,వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, లబ్ధిదారులు,టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.