ఆదుకునే దిక్కు లేక అవస్థలు పడుతున్న వ్యక్తి

*(మోతే నిజం న్యూస్)*
సెప్టెంబర్ 2
పక్షవాతం వచ్చి పది ఏండ్లు అయిన ఆదుకునే దిక్కు లేక అవస్థలు పడుతున్న ఏ ఒక్కరు పట్టించు కోవడం లేదని నర్సింహ పురం గ్రామానికి చెందిన గుర్రాల గోపాలు వాపోతు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు కూలి నాలి చేసుకొని జీవనం సాగిస్తున్న నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని ఆవేదన చెందుతు వాపోయాడు బతుకు భారమై బతికున్న శవం ల మంచానికి పరిమితమైన విగత జీవిగా ఉన్నానని నా భార్య కూలి చేసి తెచ్చిన కూలి డబ్బులతో దవాఖానకు తినడానికి తిండి కి సరిపోక ఇబ్బందు ఎదుర్కొంటున్నా నన్ను వికలాంగులుగా గుర్తించి పెన్షన్ అందించి ఆదుకోవాలని అధికారులను వేడుకొంటున్నాడు