బాల్యమిత్రుని పిల్లలకు చేయూత అందించిన స్నేహితులు

మాడ్గుల సెప్టెంబట్ 2( నిజం న్యూస్ ):
సెయింట్ గైతాన్ హైస్కూల్ విద్యార్థుల దాతృత్వం
మాడుగుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 2002లో సెయింట్ గైతాన్ హైస్కూల్లో పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి స్నేహితుడు మృతి చెందడంతో వారి పిల్లలకు మేమున్నామంటూ దాతృత్వాన్ని చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. గత నెల తమ తోటి స్నేహితుడు నర్సంపల్లి గ్రామానికి చెందిన కడారి వెంకటయ్య యాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య ఇద్దరు చిన్నారుల ను ఆదుకోవాలనే లక్ష్యంతో స్నేహితులు తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి 2 లక్షల రూపాయలను సేకరించి వెంకటయ్య కుమార్తెలు మాధవి, మానిసవి ల పేరిట శుక్రవారం మాడుగుల ఎస్ బి ఐ బ్యాంకులో తలా లక్ష పిక్స్ డు డిపాజిట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమ తోటి స్నేహితుని కల్లారా చూడలేమని వారి కుటుంబ సభ్యుల కు కొంత చేదోడుగా ఉన్నామనే తృప్తి కొంతమేర ఉంటుందని పూర్వ విద్యార్థులు అన్నారు.