ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ

మాడ్గుల సెప్టెంబర్ 2( నిజం న్యూస్): మాడ్గుల మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆసరా పెన్షన్ కార్డుల కార్యక్రమాన్ని మాడ్గుల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సభలో వృద్యాప, వితంతు, వికలాంగుల, చేనేత, గీత కార్మిక రకరకాల పెన్షన్ కార్డులను ఎంపీ చేతుల మీదుగా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయడం జరిగింది, ఈ సభలో కల్వకుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, అని అన్నారు, మాడుగుల మండలం లోని 33 గ్రామ పంచాయతీలలోని 1489 మందికి పెన్షన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మాడుగుల మండలానికి 570 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు, వాటిని త్వరలో లబ్ధిదారులను గుర్తించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు అదేవిధంగా మాడుగుల మండలం లోని 33 గ్రామ పంచాయతీల లో 20 గ్రామాల లో 250 మందిని పూర్తిగా దారిద్ర్యరేఖకు దిగువగా ఉన్న వారిని గుర్తించి దళిత బంద్ యూనిట్లను మంజూరు చేస్తామని స్థానిక శాసనసభ్యులు తెలిపారు అదేవిధంగా నర్సయపల్లి గ్రామం లోని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మహిళా కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా కుల్ కుల్ పల్లి పరిధిలోని రాజీవ్ నగర్ తండా లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన కుటుంబానికి కూడా పరామర్శించారు, అదేవిధంగా కుల్ కుల్ పల్లి రైతు వేదిక లో జరిగిన సభలో ఆ గ్రామానికి చెందిన 57 మంది గీత కార్మికులకు లైసెన్సులు పంపిణీ చేయడం జరిగింది పై కార్యక్రమాలలో కల్వకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు, మాడుగుల మండల జెడ్ పి టి సి ప్రభాకర్ రెడ్డి, మాడుగుల మండల ఎంపిపి, కల్వకుర్తి జడ్ పి టి సి పోతుగంటి భరత్, మాడుగుల మండల, సీఐ కృష్ణ మోహన్, మాడుగుల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి, కలకొండ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్రాజ్ గౌడ్, మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.