Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆసరా పింఛన్ల పంపిణీ లో ప్రభుత్వం విఫలం

వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె. రాజేష్.

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 2 నిజం న్యూస్.

ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయాలని గుంపులలో జాతీయ రహదారిపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

-ఆగస్టు నెల పూర్తయిన నేటి వరకు ఆ నెల పెన్షన్ పంపిణీ చేయకపోవడం దురదృష్టకరం ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని , ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సూర్యాపేటలో పింఛన్ల కోసం నిరసన తెలుపుతున్న వికలాంగులను అక్రమంగా అరెస్టు చేయటం దురదృష్టకరం. అక్రమ అరెస్టులతోని వికలాంగుల ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

 

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయాలని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆసరా పింఛనే జీవనాధారంగా జీవనం వెల్లదీస్తున్న వృద్ధులు వితంతువులు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు పైలేరియా బాధితులు సుమారు 38.75 లక్షల మంది ఆసరా పింఛన్ దారులకు సకాలంలో ఆసరా పింఛన్లు రాక వారి పరిస్థితి దయనీయంగా తయారయిందని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతు వివిధ రకాల మందులు వాడుతూ కాలం వెల్లదీస్తున్న వృద్ధులకు నేటికీ

 

ఆసరా పెన్షన్ అందకపోవడంతో కనీసం తమకు అవసరమైన మందులు కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయిందని సమాజం చేత కుటుంబం చేత వివక్షకు గురవుతూ తమకు వచ్చే ఆసరా పింఛన్ తోనే బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న వికలాంగులకు సకాలంలో పింఛను రాక తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారనీ పెన్షన్ నకాలంలో రాక వృద్ధులు వితంతువులు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు పైలేరియా బాధితులు పడే కష్టాలు వర్ణనాతీతంగా మారాయని బంగారు తెలంగాణలో అసరా పింఛన్లు సకాలంలో రాక ఆసరా పింఛన్ దారులు పడే కష్టాలు వారి ఓట్లతోనే గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులకు కనిపించక పోవడం దురదృష్టకరమనీ తక్షణమే ప్రభుత్వం ఆసరా పించన్లు మంజూరు చేయాలని లేకుంటరాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు ఆనరా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ బంగారు. తెలంగాణలో వికలాంగుల జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వం దళిత బందు మాదిరిగానే వికలాంగుల బంధు పథకం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో పింఛన్లు సకాలంలో పంపిణీ చేయాలని వికలాంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న వికలాంగులను అక్రమంగా అరెస్టు చేయడం దురదృష్టకరమని అక్రమ అరెస్టులతో వికలాంగుల ఉద్యమాలను ఆపలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు .

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోల్లూరి. ఈదయ్య బాబు జిల్లా ఉ పాధ్యక్షుడు మున్న మధు యాదవ్ మండల అధ్యక్షులు కొల్లూరి నాగరాజు మహిళా నాయకులు తురక నాగమ్మ మట్టపెల్లి పూలమ్మ సరిత సంఘం మండల అధ్యక్షులు సైదులు పిట్ట వెంకట్ రెడ్డి గోగు వెంకన్న శివరాత్రి బక్కయ్య బోలక ఉప్పమ్మ షేక్ హస్సేనా పబ్బు వెంకటమ్మ ఉరుముల ఆదయ్య పబ్బు లచ్చుమయ్య అచ్చమ్మ పిట్ట అమృతా రెడ్డి ఉరుముల పద్మ మూగ చంద్రమ్మ మామిడి పద్మ పసనాది రాములు నాతాల సుగుణమ్మ వెగలం శ్వేత వెగలం సక్కుబాయమ్మ దోనియాల సూరమ్మ తదితరులు పాల్గొన్నారు..