Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గర్భిణీ స్త్రీల పట్ల కాంబ్లేసాహెబ్ రావు సేవలు బేష్

ముఖ్యమంత్రి కెసిఆర్ అతని సేవలను గుర్తించి, సహాయ సహకారాలు అందించాల నీ, ప్రజల వేడుకోలు.

హైదరాబాద్ సెప్టెంబర్ 2 నిజం న్యూస్

నిర్మల్​ జిల్లా భైంసాలోని  పిప్రీ కాలనీలో ఉంటాడు కాంబ్లే సాహెబ్ ​రావు. తాపీ పని చేసే వాళ్ల నాన్న  రాందాస్​. వయసు మీద పడటంతో కొన్నేండ్ల నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. దాంతో తల్లి నాగమణి బీడీలు చుడుతూ సాహెబ్​రావుతో పాటు, మిగితా ఇద్దరు పిల్లల బాధ్యతని భుజానికెత్తుకుంది. కానీ, రానురాను ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఇంటర్​తోనే చదువు ఆపేశాడు సాహెబ్​.

 

తల్లికి చేదోడుగా ఉండాలని ఆటో నడపడం మొదలుపెట్టాడు. కానీ, తన ఫ్రెండ్​ కూతురుకి ఎదురైన ఓ సమస్య అతన్ని ఆలోచింపజేసింది. గర్భిణీల కోసంఫ్రీఆటోసర్వీసమొదలుపెట్టించింది.

ఏడాది కిందట సాహెబ్​ ఫ్రెండ్​కి కూతురు పుట్టింది. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు వాళ్లకి. పుట్టిన కొద్దిరోజులకే పాప ఆరోగ్యం బాగా పాడైంది. హాస్పిటల్​కి వెళ్లడం ఆలస్యం కావడంతో ఆ చిన్నారి చనిపోయింది. ఆ సంఘటన​ తర్వాత చాలా రోజులు నిద్రపట్టలేదు సాహెబ్​కి

 

అప్పుడే ఆ పాప పరిస్థితి మరొకరికి రాకూడదు అనుకున్నాడు.

 

బాలింతలతో పాటు ,గర్భిణీలను టైంకి హాస్పిటల్​కి చేర్చడానికి ఫ్రీ ఆటో సర్వీస్​ మొదలుపెట్టాడు. సాయం కావాలని ఎన్ని మైళ్ల దూరం నుంచి ఫోన్​ వచ్చినా రాత్రిపగలు, వారాలతో పనిలేకుండా వెళ్తున్నాడు. వాళ్లని హాస్పిటల్​కి చేర్చడమే కాదు.. ట్రీట్మెంట్​ పూర్తయ్యాక మళ్లీ తన ఆటోలోనే ఇంట్లో దిగబెడుతున్నాడు. ఆడపిల్ల పుడితే పుట్టిన తేదీ నుంచి ఆరు నెలల వరకు ఫ్రీగా తన ఆటోలోనే చెకప్​కి తీసుకెళ్తున్నాడు.ఇలా గడిచిన ఎనిమిది నెలల నుంచి  వందల మందికి సాయం చేశాడు సాహెబ్​. ఈ పనిలో అతని కుటుంబం కూడా అండగా నిలుస్తోంది.

ఈ సంఘటన మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని అతను చేస్తున్న సేవలను గుర్తించి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే సుమ…