ఆసరా పెన్షన్ల పంపిణీ- పాల్గొన్న సీఎల్పీ లీడర్ విక్రమార్క

-జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
బోనకల్ సెప్టెంబర్ 1 (నిజంన్యూస్)
బోనకల్లు మండల పరిధిలో రైతు వేదిక లో ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు, గుర్తింపు కార్డు జారీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు, మధిర శాసనసభ్యులు లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ
తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతుంది*.
ఏపీ కి కరెంట్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం*
*ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుండి రూ. లక్ష కోట్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదు*
*రాష్ట్రం విభజన జరిగినప్పుడు….కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.*
ఎనిమిదేళ్లుగా కేంద్రం ఇవ్వకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుంది.*
ఆసరా పింఛన్ల పంపిణీ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత…
వయస్సు లో ఉన్నప్పుడు పని చేసుకొని వయస్సు మీద పడిన తరువాత వారికి జీవనభృతి కల్పించడం సామాజిక బాధ్యత
ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను బట్టి పింఛన్లు ఉంటాయి. ముందు ముందు ఇంకా పెరగొచ్చు ..పింఛన్లు రానివాళ్ళ ఉన్నారు. వారందరికీ ఫించన్లు రావడానికి నేను ప్రయత్నం చేస్తా….
మండల సమస్యలు చెప్పినారు. మండల కేంద్రం అభివృద్ధి జరగాలి. గతంలో అభివృద్ధి చేశాం. భవిష్యత్ లో మరింత అభివృద్ధి చేస్తాం.
మండలంలోని సమస్యలు చాలా పెద్దవి. వాటి పరిష్కారానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు కావాలి. వాటిని తీర్చడానికి సరిపడా నిధులు ఎమ్మెల్యే దగ్గర ఉండవు కనుక ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.
హాస్టల్ కు ప్రస్తుతం నిధులు లేవు. కనుక సోషల్ వెల్ఫేర్ మంత్రిని కలిసి నిధులు తెస్తా
అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందర్నీ కలుస్తా
అలాగే వీఆర్ఏల సమస్యల గురించి ఇంతకుముందు అసెంబ్లీలోనే మాట్లాడాను మళ్ళీ మీ సమస్యల గురించి మాట్లాడుతానని విఆర్ఎల్ కి హామీ ఇచ్చారు
జిల్లా పరిషత్ చైర్మన్
లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ
వృద్ధులు వితంతులు వికలాంగుల కళ్ళల్లో ఆనందం.
నిరుపేద కుటుంబాలకు ఆత్మబంధువు కేసీఆర్.
ఆసరా పెన్షన్లు రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది.
ఆసరా పెన్షన్లు భారీగా మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు ఆత్మబందువు గా ముఖ్యమంత్రి కేసీఆర్ మారారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, అన్నారు . ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొనకల్ మండలం లో కొత్తగా మంజూరు అయిన ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు వారు అందజేశారు పెన్షన్లు తో పాటుగా లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ళు నిండిన వారికి టీ.ఆర్.ఎస్ సర్కారు పింఛన్లు మంజూరు చేసిందని 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57 ఏళ్ళు పై బడిన వారికి పెన్షన్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ వార్త చెప్పారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేడు లబ్ధిదారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు అందిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవాలని ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు అయ్యాయని వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా కొత్త వారితో కలిపి ఈ సంఖ్య 45.41 లక్షలకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 57 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నెరవేరిందన్నారు. తాజాగా డయాలసిస్ పేసేంట్ లకు సైతం పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు, మన ఖమ్మం జిల్లాలో మొత్తం 49 వేల మందికి పైగా కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని వేల సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం. జడ్పిటిసి సభ్యులు మోదుగు సుధీర్ బాబు. తాసిల్దార్ రావూరి రాధిక . ఎంపీడీవో వేణుమాధవ్. మధుర మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్తారు బోనకల్ సర్పంచ్ భూక్య సైదా మండలంలోని సర్పంచులు. ఎంపీటీసీ సభ్యులు. ఆర్ ఐ లక్ష్మణ్ నాయక్. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు , డిసిసిబి చైర్మన్ పైడిపల్లి కిషోర్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ బద్రు నాయక్, బంధం శ్రీనివాసరావు. మాజీ జెడ్పిటిసి సభ్యులు బానోత్ కొండ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు చేబ్రోలు మల్లికార్జునరావు. మోదుగుల నాగేశ్వరరావు.పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు