ఆర్ .ఎఫ్ .సి .ఎల్ బాధితుల అఖిల పక్ష కమిటీకి చట్టబద్దత ఉందా ?

ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పక్షమేనా ?
కమిటీలో విప్లవ కార్మిక సంఘాల నేతలు
సెటిల్మెంట్ అధికారపూర్వకమా అనధికారమా…!
ప్రభుత్వ గెజిట్ తో రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐ .ఏ .ఎస్ లతో
కమిటీ వేసి విచారణ జరిపించలేరా ?
గోదావరిఖని :సెప్టెంబర్ 1: నిజం న్యూస్
ఆర్ ఎఫ్ సి ఎల్ లో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికార పార్టీ నేతలు దళారులు గా వ్యవహరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు .దీనిపై ప్రతిపక్ష పార్టీ ల నాయకులు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఘాటు విమర్శలే చేశారు .న్యాయం జరగలేదనే మనస్థాపం తో హరీష్ ఆత్మహత్య చేసుకోవడం తో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే బాధ్యత వహించి కోటి రూపాయల పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు .. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు బాధితులవైపు మాట్లాడుతూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే అదే పార్టీ లకి చెందిన నాయకులు అఖిల పక్ష కమిటీలో సభ్యులు గా ఉన్నారు . బాధితులకి న్యాయం చేస్తారని
ప్రతిపక్ష నాయకులపై ఆధారపడిన బాధితులకి ప్రజానీకానికి ఎవరు అధికార పక్షమో ఎవరు ప్రతిపక్ష పార్టీ నో తెలియని పరిస్థితులు ఉన్నాయి . . ఉద్యోగాల పేరిట అధికార పార్టీ నేత అండదండలతోనే కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తుంటే అధికార పార్టీ నేతలే అఖిల పక్ష కమిటి ఎలా ఏర్పాటు చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .. ఇదిలా ఉంటె అఖిల పక్షం కమిటీకి చట్టబద్దత ఉందా అనే ప్రశ్నలు సమాజం నుండి వస్తున్నాయి .అఖిల పక్షం కమిటీ బాధితులకి డబ్బులు తిరిగి చెల్లిపించే ప్రయత్నం చేస్తే అది సెటిల్మెంట్ కిందికి రాదా అని అభిప్రాయాలు కొంతమంది వెల్లడి చేస్తున్నారు . శాసన నిర్మాణాలు చేయవలసిన ప్రజాప్రతినిధులు అధికార ప్రతినిధి గా వ్యవహరించి విచారణ పేరిట కమిటీలు వేస్తే
అధికార ప్రతినిధుల పోలీస్ అధికారుల పాత్ర ఏంటని అట్టి కమిటీ అధికార పూర్వకమా లేక అనధికారమా అని కమిటీ నిర్మాణులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది .ఇప్పటికే 420 కేసు నమోదు అయిన నిందితుల నుండి డబ్బులు రికవరీ చేసారా లేదా అనేది స్పష్టత కూడా లేదు . ఒకవేళ అఖిల పక్ష కమిటీ బాధితులకి న్యాయం కోసమే ఏర్పాటు అవుతే అదే కమిటీని ఉన్నతాధికారులతో రిటైర్డ్ న్యాయమూర్తులతో
ప్రభుత్వ గెజిట్ తో విచారణ నిమిత్తం ఏర్పాటు చేయించలేరా అని మేధావులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .
అఖిల పక్ష కమిటీలో విప్లవ కార్మిక సంఘాల నేతలు :
కార్మికులు బాధితుల పక్షం అని చెప్పుకునే విప్లవ కార్మిక సంఘాల నేతలు అఖిల పక్ష కమిటీ లో సభ్యులు గా ఉన్నారు .. విప్లవ కార్మిక సంఘాల నేతలు కమిటీ కి చట్టబద్దత ఉందా లేదా అనే ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది . అఖిల పక్ష కమిటీ బాధితులకి ఎంతమేర న్యాయం చేకూరుస్తారో వేచి చూడాల్సిందే.