శేరిలింగంపల్లి రైల్ విహార్ కాలనీ లో గ్యాస్ లీకేజీ- పేలుడు -ఒకరు మృతి -ఇద్దరికి గాయాలు

శేరిలింగంపల్లి, నిజం న్యూస్, (సెప్టెంబర్ 01):

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రైల్ విహార్ కాలనీ లోని ఫేస్ -వన్ , హౌస్ నెంబర్ -48 లో సుమారు 08:45 గంటలకు గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి పేలుడు సంభవించడం జరిగింది వివరాలకు వెళితే ఉదయం గ్యాస్ లీక్ అయ్యి అందులో నివసించే నలుగురు రాజస్థాన్ వ్యక్తులు అంబులాల్ నాయక్, రాహుల్ శర్మ, ప్రకాష్, నారాయణ్ లాల్ లో, ఒక వ్యక్తి అంబులాల్ నాయక్ అక్కడికక్కడే మరణించగా రాహుల్ శర్మ, ప్రకాష్ గాయపడ్డారు, మరో వ్యక్తి నారాయణ్ లాల్ షాక్ కి గురయ్యాడు. గాయపడ్డ వారిని పోలీస్ లు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.